శ్లో:-ధ్వజాత్
పృష్టం - పృష్టాత్ పృష్టమ్,
పృష్టాత్ పృష్టం
- పృష్టాత్ ధ్వజమ్.
భావము:-
శివాలయములో ధ్వజ
స్తంభము నుండి ఆలయము వెనుక శివుని పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి నడచు కొనుచు మరల ఆ
పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి
వెను తిరిగి మరల నడచుకొనుచు పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి ధ్వజ స్తంభము వరకు
వెళ్ళ వలెను అని శ్లోక భావము.
వృషంచండంవృషంచైవ
సోమసూత్రం పునర్వృషం|
చండంచ సోమసూత్రంచ
పునశ్చండం పునర్వృషం||
శివప్రదక్షిణేచైవ
సోమసూత్రం నలంఘయేత్|
లంఘనాత్సోమసూత్రస్య
నరకే పతనం ధృవం||
--> గృహస్తు
నందీశ్వరుని వద్ద
ప్రారంభించి - కుడిచేతి వైపు చండీశ్వరుని చేరి - అక్కడనుండి మళ్లీ వెనుకకు (
నందీశ్వరుని మీదుగా )సోమసూత్రం చేరి - మళ్లీ వెనుదిరిగి నందీశ్వరుని- నేరుగా
చండీశ్వరుని వద్దకు వెళ్లి - అక్కడ వెనుదిరిగి ( నందీశ్వరుని మీదుగా ) సోమసూత్రం
చేరి - మళ్లీ వెనుదిరిగి ( నందీశ్వరుని మీదుగా ) చండీశ్వరుని చేరి - వెనుదిరిగి
నందీశ్వరుని వద్దకు చేరుకుంటే ఒక "శివ ప్రదక్షిణ" పూర్తి చేసినట్లు. శివ
ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. దాటితే నరకంలో పడి పతనమౌతనమవడం తథ్యం.కొద్దిగా
సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు.
-->బ్రహ్మచారి
సవ్య్యం గా ప్రదక్షిణ చేయాలి.