మళ్లీ వశిష్టమహాముని
కార్తీక మాస మహత్యాలను గురించి తనకు తెలిసిన అన్ని విషయాలను జనకుడికి చెప్పాలనే
కుతూహలంతో ఇలా చెబుతున్నారు… ”ఓ రాజా! కార్తీక పౌర్ణమి
రోజున పితృప్రీతిగా వృషోత్సవం చేయడం, శివలింగ
సాలగ్రామాలను దానం చేయడం, ఉసిరికాయల్ని దక్షణతో దానం
చేయడం మొదలగు పుణ్యకార్యాలు చేయడం వల్ల వెనకటి జన్మల్లో చేసిన సమస్త పాపాలు
తొలగిపోతాయి. అలా చేసేవారికి కోటి యాగాల ఫలితం దక్కుతుంది. వారి వంశానికి చెందిన
పితృదేవతలు పైలోకాల నుంచి ఎవరు ఆబోతుకు అచ్చువేసి వదులుతారో? అని చూస్తుంటారు. ప్రతిసంవత్సరం కార్తీక మాసంలో శక్తికొలదీ దానం
చేసి, నిష్టతో వ్రతమాచరించి,
శివకేశవులకు ఆలయంలో దీపారాధన చేసి, పూజరోజున రాత్రంతా జాగారం ఉండి, మర్నాడు శక్తికొలదీ బ్రాహ్మణులు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహ, పర లోకాల్లో సర్వసుఖాలను పొందగలరు” అని వివరించారు.
కార్తీకమాసంలో చేయాల్సిన
పనులను చెప్పిన వశిష్టుడు మరికొన్ని నిత్యాచరణ విధులతోపాటు, చేయకూడనివేవో ఇలా చెబుతున్నాడు… ”ఓ రాజా! పరమ పవిత్రమైన ఈ నెలలో పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల
ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం
చేయకూడదు. నీరుల్లి తినకూడదు. తిలాదానం తగదు. శివార్చన, సంధ్యావందనం, విష్ణుపూజ చేయనివారు
వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల్లో సూర్యచంద్ర గ్రహణం రోజుల్లో భోజనం చేయరాదు.
కార్తీక మాసంలో నెలరోజులూ రాత్రుళ్లు భోజనం చేయకూడదు. ఈ నెలలో విధవ వండింది
తినకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ
రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం చేయాలి. ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. ఈ నెలో
ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయకూడదు. పురాణాలను విమర్శించరాదు. కార్తీక మాసంలో
వేడినీటితో స్నానం కల్తుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి, వేడినీటి స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉంది, ఎలాగైనా విడవకుండా కార్తీకమాస వ్రతం చేయాలనే కుతూహలం
ఉన్నవారు మాత్రమే వేడినీటి స్నానం చేయొచ్చు. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతీ, యమునా నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానం చేయాలి. తనకు
దగ్గరగా ఉన్న నదిలో ప్రాత్ణకాలంలో పూజ చేయాలి. నదులు అందుబాటులో లేని సమయంలో
నూతిలోగానీ, చెరువులో గానీ స్నానం
చేయవచ్చు. ఆ సమయంలో కింది శ్లోకాన్ని స్మరించుకోవాలి…
శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదా సింధు కావేరి
జలేస్మిన్ సన్నిదింకురు||
”కార్తీక మాస వ్రతం చేసేవారు
పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథా కాలక్షేపంతో కాలం గడపాలి. సాయంకాలంలో సంధ్యావందనాది
కార్యక్రమాలు పూర్తిచేసుకుని, శివుడిని కల్పోక్తంగా
పూజించాలి” అని వివరించారు. అనంతరం
కార్తీకమాస శివపూజాకల్పాన్ని గురించి వివరించారు.
కార్తీక మాస శివ పూజ కల్పము
1 ఓం శివాయ నమ్ణ ధ్యానం
సమర్పయామి
2 ఓం పరమేశ్వరాయ నమ్ణ అవాహం
సమర్పయామి
3 ఓం కైలసవాసయ నమ్ణ నవరత్న
సంహాసనం సమర్పయామి
4 ఓం గౌరీ నాథాయ నమ్ణ పాద్యం
సమర్పయామి
5 ఓం లోకేశ్వరాయ నమ్ణ
అర్ఘ్యం సమర్పయామి
6 ఓం వృషభ వాహనాయ నమ్ణ
స్నానం సమర్పయామి
7 ఓం దిగంబరాయ నమ్ణ వస్త్రం
సమర్పయామి
8 ఓం జగన్నాథాయ నమ్ణ యజ్ఞో
పవితం సమర్పయామి
9 ఓం కపాల ధారిణే నమ్ణ గంధం
సమర్పయామి
1ం ఓం సంపూర్ణ గుణాయ నమ్ణ
పుష్పం సమర్పయామి
11 ఓం మహేశ్వరాయ నమ్ణ
అక్షతాన్ సమర్పయామి
12 ఓం పార్వతీ నాథాయ నమ్ణ
దుపం సమర్పయామి
13 ఓం తేజో రూపాయ నమ్ణ దీపం
సమర్పయామి
14 ఓం లోక రక్షాయ నమ్ణ
నైవైధ్యం సమర్పయామి
15 ఓం త్రిలోచనాయ నమ్ణ కర్పూర
నీరాజనం సమర్పయామి
16 ఓం శంకరాయ నమ్ణ సవర్ణ
మంత్ర పుష్పం సమర్పయని
17 ఓం భావయ నమ్ణ ప్రదక్షణ
నమస్కారాన్ సమర్పయామి
ఈ ప్రకారం కార్తీకమాసమంతా
పూజలు నిర్వహించాలి. శివసన్నిధిలో దీపారాధన చేయాలి. ఈ విధంగా శివపూజ చేసినవారు
ధన్యులవుతారు. పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమర్థన చేసి, దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఇలా చేసినట్లయితే.. నూరు
అశ్వమేథాలు, వేయి వాజపేయి యాగాలు చేసిన
ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో నెలరోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి,
వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. శక్తి కలిగి ఉండి కూడా ఈ
వ్రతమాచరించనివారు వంద జన్మలు నానాయోనులయందు జన్మించి, ఆ తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలనెత్తుతారు. ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా
ఆచరించేవారు పదిహేను జన్మల పూర్వజ్ఞానాన్ని పొందుతారు. వ్రతం చేసినా, పురాణం చదివినా, విన్నా అట్టివారు
సకలైశ్వర్యాలను పొందుతారు. అంత్యమున మోక్షాన్ని పొందెదరు”.
ఇట్లు
స్కాందపురాణాంతర్గతమందలి వశిష్టుడు బోధించిన కార్తీ మహత్యం… పద్నాలుగో అధ్యాయం సమాప్తం.
పద్నాలుగో రోజు పారాయణం
సమాప్తం.