శివ సందర్శన విధి



సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందికే, శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది. శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది. 5 ముఖాల్ని 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు. శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది. కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది.

పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది. అలా శివలింగానికి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమంవైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని సద్యోజాత శివలింగం అని అంటారు. అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని స్మరించుకోవాలి. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత శివలింగం. శివలింగం తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటుంటి శివలింగాన్ని తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది. అంటే చీకటిలో ఉంచటం. అది మనల్ని మాయ చేత కప్పి బడేస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది. ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాము. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం. సద్యోజాత ముఖం పూజించ తగినదే. ఏ మాత్రం అనుమానం లేదు. మనల్ని రక్షించినా, శిక్షించినా అన్నీ ఆ పరమేశ్వరుడేగా.

తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు మీద అధిష్ఠానం కలిగి ఉంటాడు. మనకు ప్రతీ శివాలయాల్లోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి. శివాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి. ముఖాలు మనకు 5 ఫలితాలని కలుగజేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము యివ్వబడతాయి. అన్ని ముఖాలు పూజనీయమైనవే. అన్ని ముఖాల్ని మనం పూజించి తీరాల్సిందే. శివలింగం దక్షిణంవైపు చూస్తూ ఉంటే అటువంటి ముఖం దక్షిణామూర్తి స్వరూపం. మనకు శివాలయంలో దక్షిణంని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉండి తీరాలి. అసలు దక్షిణామూర్తి విగ్రహం లేకుండా శివాలయాలు కట్టకూడదు.

శివలింగం దక్షిణానికి చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్ఠానం అయి ఉంటుంది. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి, మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువుపట్ల భయం పోగొట్టేది, మనకి జ్ఞానం ఇచ్చేది ఇదే. మీరు జాగ్రత్తగా గమనిస్తే చిన్న పిల్లలకు చదువు దగ్గరనుండి, సంపద దగ్గరనుండి, పెద్దలకు మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద, విద్యలేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షానికి అధిష్ఠానం అయి ఉంటాడు. ప్రతిరోజూ ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే మోక్షము కరతళామలకము. వారి అంత్యమునందు సాక్షాత్తు ఈశ్వరుడే గుర్తుపెట్టుకుని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ధ్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.

ఉత్తరం వైపు చూసే ముఖాన్ని "వామదేవ'' ముఖం అని అంటారు. ఇప్పటిదాకా 4 దిక్కుల్ని చూస్తున్న, 4 దిక్కులా గురించి తెలుసుకోగలిగాం. ఇక చివరి ముఖం శివలింగంపైన (అంటే ఆకాశంవైపు చూస్తూ ఉండే ముఖం)ఉండే ముఖం. ఆ ముఖాన్ని "ఈశాన ముఖం'' అంటారు. మనం లిగంపైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి. ఈశాన ముఖ దర్శనం మనం మిగిలిన నాలుగు ముఖాల్ని దర్శించిన తరువాతనే దర్శించాలి. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చుని, దక్షిణంవైపు చూస్తూ ఉంటుంది. ఉత్తరం వైపు చూసి "వాసుదేవ ముఖం'' నీటి మీద అధిష్ఠానం అయి ఉంటుంది. ఈ వాసుదేవ ముఖమే మనకు సమస్త మంగళము ఇచ్చే ముఖం.

వాసుదేవ ముఖం అంటే ఏమిటి అనేది మనకు శివపురాణంలో చెప్పబడింది. యదార్తమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే విష్ణువు, శివుడు ఒకరే ... రెండు లేనే లేవు .... శివపురాణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికైనా సంశయం ఉంటే ఒకటి గమనించండి. శివపురాణంని రాసినది వేదవ్యాసుడు. వ్యాసుడే విష్ణువు ... విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ విధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే ... రెండు కాదు. చాలామంది వేరుగా చూస్తూ పొరబడుతున్నారు. కృష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను. ఈ వాసుదేవ ముఖాన్ని ఓం వాసుదేవాయ నమః అని అంటే మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు.

అంతేకాక ఈ వాసుదేవ ముఖాన్ని "ఓం వాసుదేవాయ నామహ" అని అంటే మనకు మూడు ఫలితాలని కూడా ఇస్తుంది. అవి ఒకటి మీ దగ్గర ఏదైతే ఉందొ అది మీ చేయి జారిపోకుండా మీతోనే ఉంచుతాడు. ఉదాహరణకు మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి లేదా ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. రెండు ... మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే ఇస్తారు. ఉదాహరణకు ... ఉన్న కోటిని ధర్మబద్ధంగా రెండు కోట్లు చేస్తారు. (ఇది ఉదాహరణ మాత్రమే మీకు ఈజీగా అర్థమవ్వాలని) మూడు ... మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఉదాహరణకు ... ఇప్పుడు తీపి పదార్థాలను కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్థితిలో (షుగర్ ఉందనుకోండి) ఉంటే, అప్పుడు ఉన్న దాన్ని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండా కాపాడతాడు.

తురువాత ఈశాన ముఖము. శివాలయంలో లింగ దర్శనం అయ్యాక ఒకసారి పైకి చూసి ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి. ఆ ఈశాన ముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్ఠానం అయి ఉంటుంది. శివాలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెళ్ళినప్పుడు మనలో ఉండే అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకుని ముందుకు సాగాలి.


శివాలయంలో పురుషులకి ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేశించబడింది. పురుషులు కేవలం పంచె మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్వ్యంని నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణాలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వారిపట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ముందుగా చెప్పినట్లు పదఘట్టన వినకూడదు జాగ్రత్త. మీరు శివాలయంలో ఎట్టి పరిస్థితులలోనూ విభూధిని కాని, బిల్వపత్రాలని కాని, కుంకుమను కాని, ప్రసాదాన్ని కాని ఎట్టి పరిస్థితులలో నందీశ్వరుడి మీద పెట్టకూడదు. సాధారణంగా చాలామంది నందిమీద విభూధిని, బిల్వఆకులను వేస్తూ ఉంటారు. అది మహాపాపంగా పరిగణించబడింది. అందరూ శివరాత్రి రోజు శివమహిమ్నాస్తోత్రం చదవండి. శివస్తోత్రాలు అన్నింటిలోకి చాలా ప్రాముఖ్యమైనది "శివమహిమ్నాస్తోత్రం''

మహాశివరాత్రి వృత్తాంతం

మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.  
గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణ మహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.

అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకునందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగావ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగానిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.

బ్రహ్మవిష్ణువుల యుద్ధం 
ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగ మహాత్ములగు బ్రహ్మవిష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించెను. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళిశేష శయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, "నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. నీ ప్రభువను వచ్చి ఉన్నాను నన్ను చూడుము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును" అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించిఆసనం ఇచ్చి, "నీచూపులు ప్రసన్నంగా లేవేమి?" అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ "నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తునునిన్ను కూడా రక్షించువాడను" అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో "జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు" అంటాడు.

ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగిచివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైనవిష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మవిష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగావిష్ణువు మాహేశ్వరాస్త్రంబ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేకదేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాల కు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసం లో మణులు పొదగబడిన సభా మధ్యం లో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శద్ధతో వింజామరలు వీచుచుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో "బ్రహ్మవిష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది " అంటాడు. 

బ్రహ్మవిష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పితాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతోవింజామరతోపుష్పవర్షముతోసంగీతము నాట్యమాడే గుంపులతోవాద్య సముహంతోపార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపిరహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రంపాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మవిష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆదిఅంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడైబ్రహ్మ ఆది తెలుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయం లో మార్గమధ్యం లో కామధేనువు క్రిందకు దిగుతూనుఒక మొగలి పువ్వు(బ్రహ్మవిష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. 

ఆ రెంటిని చూసి బ్రహ్మ 'నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే" అని చెప్పి కామధేనువు తోనుమొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసితాను ఆదిని చూశాననిదానికి సాక్ష్యం కామధేనువుమొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు.కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగాబ్రహ్మ స్తంభం ఆది ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపినిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువుబ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడనివిష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.

బ్రహ్మకు శాపము 
శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మ ను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లిపూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు బ్రహ్మని క్షమించిబ్రహ్మకు స్థానముపూజ అభిషేకము మున్నగునవి ఉండవు అని చెప్పాడు. నిన్ను అగ్నిష్టోమముయజ్ఞములలో గురుస్థానము లో నిలబెడుతున్నాను అని విష్ణువుతో చెప్పాడు.

మొగలి పువ్వుకు శాపము 
ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదుకాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపము లో నాపై ఉంటుంది అని చెబుతాడు.

కామధేనువుకు శాపము 
అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుకకోపమును దిగమ్రింగి, " మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదుకాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమైపూజలనందుకొనును" అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనదిగోమూత్రముగోమయముగోక్షీరము లు పునీతములైనవైపూజాపురస్కారములలో వాడబడుచున్నవి.

శివరాత్రి పర్వదినం 
ఆ తరువాత బ్రహ్మవిష్ణువు దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో "మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.

ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగాసాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది" అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపము గా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు. 

జాగరణము 

జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తినిశివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపితాను శివుడైసర్వమును శివస్వరూపముగా భావించిదర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యముశివభజనలో సామీప్యముశివభక్తులతో కూడిశివ విషయములు ప్రసంగించుటలో సలోక్యముశివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము.

శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రము

నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై "న" కారాయ నమశ్శివాయ ||

మందాకినీ సలిత చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై "మ" కారాయ నమశ్శివాయ ||

శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వర నాశనాయ |
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై "శి" కారాయ నమశ్శివాయ ||

వసిష్ఠకుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ |
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై "వ" కారాయ నమశ్శివాయ ||

యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ |
సుదివ్యదేహాయ దిగంబరాయ తస్మై "య" కారాయ నమశ్శివాయ ||

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ శివలోక మవాప్నోతి శివేన సహమోదతే ||
|| ఇతి శ్రీమత్‌ శంకరాచార్య విరచిత శివపంచాక్షరీ స్తోత్రం సంపూర్ణము || 

ద్వాదశజ్యోతిర్లింగ స్తోత్రము

సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునమ్‌
ఉజ్జయిన్యాం మహాకాళం, ఓంకారం అమరేశ్వరం
వైద్యనాథం చితాభూమౌ, ఢాకిన్యాం భీమశంకరం
సేతు బంధేచ రామేశం, నాగేశం దారుకావనే
వారణాశ్యాంతు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీతటే
కేదారం హిమవత్‌ పృష్టే, ఘృశ్మేశం శివాలయే
ద్వాదశైతాని నామాని ప్రాతరుత్ధామయః పఠేత్‌
సర్వపాప వినిర్ముక్తః సర్వసిద్ధి ఫలం లభేత్‌ ||

శ్రీశైల రగడ - శ్రీశైల మానసిక యాత్ర-శ్రీ శివ స్తోత్రములు

శ్రీ రమ్యంబుగ శ్రీ గిరి యాత్రకు| కూరిమి సతితో కూడి నడచితిని
పల్లెలు పురములు పట్టణంబులు। పేటలు దాటితి అడవులు కొండలు అన్నీ దాటిది
కంటిని శ్రీగిరి కన్నులనిండా। వింటిని మహిమలు వీనుల నిండా
ఆ మహిమలు నేనేమని చెప్పదు| ఈ మహిలోపల ఎన్నడు చూడము
ధారుణి లోపల అధౌతాచల మది। మేరునికంటెను మిక్కుటమైనది
బ్రహ్మనిర్మల బహి శృంగంబులు। నిర్మలమగు మాణిక్య కూటములు
కోటలు కొమ్మలు గోపురంబులు। తెరపిలేని బహుదేవాలయములు
పుణ్యస్థలంబులు పుణ్యవనంబులు। వాటమైన పూదోటలు మిక్కిలి
మాటలు నేర్చిన మంచి మృగంబులు। కామధేనువులు కల్పవృక్షములు
క్షేమ కరంబగు చింతామణులు। అమృత గుండంబులు
కడు నైష్ఠికమును కలిగిన విప్రులు। విడువక శంభుని వేడెడి రాజులు
సంతత లింగార్చన గల శైవులు| శాంతులైన వేదాంతులు సిద్ధులు
ఘన ఘన మ్రోగేటి ఘంటనాదములు। విజయ ఘోషయగు శంఖనాదములు
వీర శైవులు వీరాంగంబులు। సాధు బృందములు కామిత భక్తులు అగరు ధూపములు
జపములు చేసేటి జంగమోత్తములు। తపములు చేసెటి తాపసోత్తములు
ప్రమధులు భక్తులు శైవ గణంబులు। గట్టిగ ఇది భూకైలాశం అని
తప్పిపోక పాతాళ గంగలో। తెప్పున తేలుచు తీర్థంబాడుచూ
చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి। అనువుగా నుదుట విభూతి ధరిస్తిని
పొదుపుగ మెడ రుద్రాక్షలు దాల్చితి
గురు కటాక్షమును గోప్యము చేసితి। గురు మంత్రంబును జపమును చేసితి
అకలంకుడనై ఆశ జయస్తిని
శివ పంచాక్షరి మనసున నిలిపితి। శివ తత్వము పరిశీలన చేసితి
పంచేంద్రియంబులు పదిలము చేసితి। పంచముద్రలభ్యాసము చేసితి
అంతర్ముఖుడనైతిని। నాద బ్రహ్మనాదము వింటిని! లోపల తుమ్మెద నాదము వింటిని
వెలుగులకెల్లా వెలుగై వెలెగెడు। ఆ లోపల దీపము కంటిని
ఇవాళ చంద్రుండావల సూర్యుడు। కలిగిన స్థావరమైన నిదానము కంటిని
కంటికి ఇంపగు పండు వెన్నెల। విరిసిన షట్క మలంబులు షష్ఠలంబులు
పిండాండములో బ్రహ్మాండము కంటిని
అంతట అక్కడ చెంగల్వ కొలనులో। ఆడుచున్న రాచంసను పట్టితి
చాల వేయి స్తంభాల మేడలో। బాలిక కూడుకు కేళి సలిపితిని
మల్లిఖార్జునిని మదిలో దలచితి। ముందర బృంగికి మ్రొక్కి వేడితిని
నం దికేశ్వరుని నమ్మిభజింతిని। చండీశ్వరునకు దండం పెట్టితి
మళ్లీ మళ్లీ మహిమను పొగడుచు। పెళ్ళారయ్యకు ప్రియముగా మ్రొక్కితి
ద్వార పాలకుల దర్శన మాయను। ద్వార మందు రతనాల గద్దెపై
చూచితి నెవ్వరు చూడని లింగం। చూచితి కేవల సుందర లింగం
నిరుపద్రవమగు నిశ్చల లింగం। ఆది తేజమగు ఐక్య లింగం
రాజితమైన విరాజిత లింగం। పూజనీయమగు పురాణలింగం
లింగము గనుకొని లింగ దేహినై। లింగాంగులతో లింగ నిర్గుణ సంగతి కంటిని
లింగ మందు మదిలీనము చేసితి। జీవన్ముక్తుడనైతిని
అంక మందు భ్రమరాంబిక ఉండగ। మల్లిఖార్జునిని కోరి పూజింతిని
దీపము పెట్టితి దివ్యదేహునకు। ధూపము వేసితి ధూర్జటి కప్పుడు
తుమ్మిపూలతో పూజిస్తిని। కమ్మని నైవేద్యము పెట్టితి
సాగిలి మ్రొక్కితి సర్వేశ్వరునకు। జయ జయ జయ జయ జంగా మరాయ
అది దేవుడవు ఆత్మ శరణ్య। దయ తప్పక ధవళ శరీర। భయము బాపు మీభక్త నిదాన
ఎన్ని జన్మములు ఎత్తిన వాడను। నిన్ను తలంపక నీచుడనైతిని
ఎన్నడు ఏ విధమేరుగని వాడను। దుష్ట మానసుడ గౌరీ రమణ
తామస గుణములు తగులాటంబులు। నియమము తప్పిన నీచవర్తనుడ। నిత్య దరిద్రుడ
అత్యాశయుడను అజ్ఞాన పశువును। చేయరాని దుశ్చేష్టలు చేసితి। బాయరాని మీ భక్తుల బాసితి
సంసారంబను సంకెళ్ళలో। హింస పెట్టమిక ఏలుము తండ్రి
ముల్లోకంబులు ముంచెడి గంగను। సలలితముగ జడ దరియిస్తివి
గొప్పచేసి నిను కొలిచిన భంటును। తప్పక చంద్రుని తల దరియిస్తివి
విన్నుని చేతను కన్ను పూజగొని। సన్నుతి కెక్కిన చక్ర మిచ్చితివి
ఆనక శైల కుమారిక కోరిన। సగము శరీరము యిస్తివి
మూడు లోకముల ముఖ్యము నీవే। మూడు మూర్తులకు మూలము నీవే
దాతవు నీవే। భ్రాతవు నీవే। తల్లివి నీవే। తండ్రివి నీవే। బ్రహ్మము నీవే। సర్వము నీవే
పాల ముంచుమిక నీట ముంచుమి। పాల బడితనో ఫాలలోచన
అనుచు ప్రణతుల నిడుచు ఇది చదివిన వారికి॥

ఫలశ్రుతి:
కాలువలు త్రవ్వించి గన్నెర్లు వేసి। పూలు కోసి శివునకు పూజించిన ఫలము
గంగి గోవులు తెచ్చి ప్రేమతో సాకి। పాలు తీసి అభిషేకము చేసిన ఫలము
ఆకలితో నున్న అన్నార్తులకును। కమ్మని భోజనం బిచ్చిన ఫలము
భీతితో నున్నట్టి కడు దీనులకును। శరణిచ్చి రక్షించు విశేష ఫలము
అంతకన్నా ఫలము అధిక మయ్యుండు.
తరతరాలుగా నోటి పాటగా వస్తున్నది 

-- శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి శివ మహాపురణం ప్రవచనం

కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు

స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం "కార్తీకమాసం'. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి "కార్తీకమాసం" అని పేరు వచ్చింది.

"న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్"

అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే "కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు." అని అర్ధం.

కార్తీకమాసం శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీకమాసంలో ప్రతీరోజూ తెల్లవారుఝూముననే స్నానమాచరించవలెను.అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించినా, ఆరాధించినా, దీపమును కార్తీకమాసంలో వెలిగించడం, నదిలో దీపాలను వదలడం , ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించవలేను. కార్తీకమాసమంతా ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించవలెను. అట్లే సాయంత్ర సమయంలో శివాలయాల్లో గానీ వైష్ణవాలయాల్లోగానీ గోపురద్వారం వద్దగానీ, దేవుని సన్నిదానంలోగానీ ఆలయప్రాంగణంలోగానీ దీపాలు వెలిగించిన వారికి సర్వపాపములు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం. ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూడడం కూడ పుణ్యప్రదమే!

కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమినాడుగాని లేక ఇతర దినాల్లో అయినా సాయంసమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను ఉంఛి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వులనూనెతోగానీ,కొబ్బరినూనెతోగానీ, నెయ్యితోగాని, అవిశనూనెతోగానీ, ఇప్పనూనెతోగానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపమును వెలిగించవలెను. అంతే కాకుండా కార్తీకమాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీకమాసంలొ ముప్పై రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్ర వచనం. ఈ విధంగా కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం , దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళూ, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.

కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు.
కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను.
నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమరోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను.

శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను.
ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను. 
ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడుపువ్వులతోనూ పూజించవలెను. 
ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.

కార్తీక మాసంలో పండుగలు:

ఉత్థాన ఏకాదశి:
ఈ మాసంలో వచ్చే కార్తీకశుద్ధ ఏకాదశి ఎంతో వైశిష్ట్యం వుంది.ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు.దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఉత్థాన ఏకాదశిగా పిలుస్తుంటారు. ఉత్థాన ఏకాదశినాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఈరోజు ఉపవాసం వుండి మరుసటిరోజు ద్వాదశి పారయణం చేస్తే ఎంతో మంచిది. ఈ కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైబోవోపేతంగా పూజలందుకుంటారు ప్రధానంగా భక్తులు కార్తీకమాసంలో శివాలయానికి వెళ్ళి పార్వతీ-సమేత పరమేశ్వరునికి భస్మలేపనం, బిల్వపత్రాలు, అవిసే పూలతో పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మిక.

కోరికలను తీర్చే దీపపు కాంతులు:
పౌర్ణమిరోజు వేకువజామున గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటిదొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదులుతుంటారు. ఈ సమయంలో కోరుకున్న కోర్కెలు నెరవేరతాయనే సంకల్పంతో వివాహం కాని యువతులు భక్తిశ్రద్ధలతో కార్తీకదీపాలను నదుల్లో వదులుతారు.

పూర్వం శౌనకాది మహర్షులతో కలిసి ఆశ్రమం నిర్మించుకుని నైమి శారణ్యంలో నివసిస్తున్న అదిగురువు సూత మహర్షి కార్తీకవ్రత మహత్మ్యం, దానిని ఆచరించే విధానం గురించి ఋషులకు బోధించాడు. ఇలాంటి వ్రతమే కావాలని పార్వతీదేవి కుడా ఈశ్వరుని ప్రార్థించినట్టు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు నారదనికి, మహావిష్ణువు లక్ష్మిదేవికి ఈ వ్రతవిధానం చెప్పారు. దీని గురించి స్కందపురాణంలో కూడా వివరించడం విశేషం.కార్తీక పౌర్ణమిరోజు రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని పండితులు చెబుతుంటారు. ఈ రోజు బ్రాహ్మీ సమయంలోనే తులసిని పూజిస్తారు. పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి 365 వత్తులతో హారతి ఇవాలి. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేస్తే చాలా మంచిది.

కార్తీక సోమవారాలు - నదీస్నానాలు:
కార్తీకమాసం వచ్చిన వెంటనే నదీస్నానం అత్యంత ప్రధాన మైనదని భక్తులు నమ్ముతుంటారు. లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్తీకమాసంలో వేకువవేళల్లో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం చాలా మంచిదని ఋషులు పేర్కొన్నారు. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైనా వుంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీక మాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. ముఖ్యంగా కార్తీకమాసంలో శివభక్తితో శీతల స్నానమాచరించడం ఆరోగ్యనికి మంచిదని చెబుతారు. దీంతోపాటు ఈ నెలరోజులు భక్తులు సాత్వికాహారం పరి మితంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ మాసంలో ముక్ష్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన భక్తులకు మహత్తరశక్తి కలుగుతుందని చెబుతారు.

కార్తీక పౌర్ణమి:
కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీకపౌర్ణమి రోజున దీపారాధన చేయడంవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు.

వనభోజనం :
కార్తీకమాసం అంటేనే వనబోజనాల మాసం అని చెప్పుకోవచ్చు. ఉసరిచెట్టుక్రింద శ్రీ మహావిష్ణువుని ఫోటో పెట్టి పూజించడంతో పాటు అదే చెట్టుక్రింద సహబంతి భోజనాలు చేయాలి.

క్షీరాబ్ది ద్వాదశి:
అలాగే ఏకాదశి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఏకాదశి నాడు విష్ణుమూర్తి క్షీర సాగరం నుంచి బయలుదేరి వచ్చి తనకెంతో ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలో ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. ఆ కారణం చేతనే ఈ రోజున తులసి దగ్గర విశేష పూజలు జరుపుతుండటం ఆచారంగా వస్తోంది. ఈ ద్వాదశినే మధన ద్వాదశి అని కూడా అంటారు.
దేవ దానవులు సముద్రాన్ని మధించింది.. కార్తీక శుద్ధ ద్వాదశి నాడని, దానికి గుర్తుగానే ఈ ద్వాదశిని జరుపుకోవడం ఆచారమైందని పెద్దలంటారు. ఈ రోజున కడలిలో శయనించిన విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశినాడు, లక్ష్మీ, బ్రహ్మలాంటి దేవతలందరితో కలిసి తులసి దగ్గరకు వస్తాడు. ఆ రోజున సూర్యాస్తమం తర్వాత తులసిని, విష్ణువును పూజించిన దానాది కార్యక్రమాలు చేసే వారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా దీపదానం చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.

ఇంకా కార్తీక ద్వాదశి రోజున తులసిని పూజించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ఈ రోజున కొన్ని తులసి దళాలను నములుతూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుచేత కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శివ, విష్ణువులతో పాటు తులసీ కోటను కూడా పూజించేవారికి ఈతిబాధలు తొలగి, సకల సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా ఈ రోజుల్లో శైవ, వైష్ణవ క్షేత్రాలను దర్శించుకునే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

కార్తీకమాస వ్రతాలు:

కేదారేశ్వర వ్రతం :
చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి సిరిసంపదలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.

అఖండమాస సౌభాగ్యవ్రతం :
వివాహితులు ఈ అఖండ సౌ భాగ్యాలను చేస్తారు. భర్త కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలంటూ చంద్రునికి ఆద్యం ఇచ్చి వ్రతాన్ని పూర్తి చేస్తారు. కార్తీక చతుర్థశి నాడు చేసే ఈ వ్రతంలో స్త్రీలు శివపార్వతులను కార్తీకేయుని,గౌరీదేవిని పూజించాలి. పాండవులు వనవాసం చేసే రోజులలో అర్జనుడు ఇంద్రనీలాద్రిపై తపస్సుచేయడానికి వెళ్లాడు.ఎంతకాలమైన తిరిగి రాలేదు. అర్జనుడు రాకపోవడానికి కారణాలు తెలిపాక ద్రౌపతి ఎంతో బాధపడింది. అర్జనుడు తిరిగి రావాలంటే సౌబాగ్యవ్రతం చేయాలంటూ కృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతమహాత్యం,వ్రతవిధానం వివరించాడు.

గోవత్స ద్వాదశి ఉత్సవం :
ఈ మాసంలో వచ్చే కృష్ణ ద్వాదశిన గోవత్స ద్వాదశి అంటారు. ఆ రోజు వ్రతం చేసుకునే వారు తెల్లవారుజామున లేచి నదీస్నానం చేయాలి. రోజుమొత్తంమీద ఒక్కపూట భోజనం చేయాలి. దూడతో కూడిన ఆవును పూజిస్తారు.

గోత్రి రాత్రీ వ్రతం :

ఈ వ్రతాన్ని కార్తీక కృష్ణాత్రయోదశనుండి అమవాస్య వరకు చేస్తారు. గోవర్దునికి రెండు వైపుల రుక్ష్మిణి, సత్యభామలు, బాలచంద్రడు, యశోద తదితర ఫోటోలు పెట్టి పూజించి, తదుపరి గోమాతను పూజంచాలి. తెల్లవారుజామున లేచి స్నానంచేసి గాయిత్రిమంత్రంతో 110 పిడికిళ్లు నువ్వులను ఆహుతిఇచ్చి వ్రతాన్ని పూర్తిచేయాలి.

--చాగంటి కోటేశ్వరరావు గారు